post office employee fraud: కష్టపడి చెమడోడ్చి పనిచేశారు... పైపాపైసా కూడబెట్టారు. భవిష్యత్తు అవసరాల కోసం తపాలా శాఖలో పొదుపు చేశారు. కానీ అక్కడ ఓ ఉద్యోగి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని గోపాలపట్నంలో వెలుగుచూసింది.
post office employee fraud: ఎలమంచిలి ప్రాంతానికి చెందిన ఎస్.కె. వల్లీ.. గోపాలపట్నం శివారు ఎల్లపువానిపాలెం తపాలాశాఖలో జీడీఎస్గా పదిహేడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తపాలా పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించేవారు. చాలామంది రూ.25 వేల నుంచి రూ.16 లక్షల వరకు తమ ఖాతాల్లో పొదుపు చేశారు. ప్రతి నెలా నిర్ణీత సమయంలో ఖాతాదారులు జమ చేసే సొమ్మును, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్మును తపాలాశాఖ ఖాతాకు కాకుండా తన సొంత ఖాతాకు మళ్లించాడు.
మోసం బయటపడిందిలా...
post office employee fraud: ఎల్లపువానిపాలెం రజకవీధికి చెందిన కొండవలస రాము... గతంలోనే రూ.6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. పథకం కాలపరిమితి ముగియడంతో శుక్రవారం నగదు తీసుకునేందుకు పోస్టాఫీసుకు వెళ్లారు. విధుల్లోకి వచ్చిన కొత్త ఉద్యోగి.. రాము పాస్ పుసక్తం పరిశీలించి నకిలీదిగా తేల్చారు. కంగుతిన్న బాధితుడు లబోదిబోమంటూ ఇంటికెళ్లి.. ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో ఖాతాదారులు 60 మంది తపాలా కార్యాలయానికి వెళ్లి పుస్తకాలు తనిఖీ చేయించుకున్నారు. అవన్నీ నకిలీవని తేలడంతో బాధితులు నిర్ఘాంతపోయారు. దాదాపు రూ.1.5 కోట్ల సొమ్మును సదరు ఉద్యోగి స్వాహా చేసినట్లు బాధితులు గుర్తించారు. ఈ మేరకు బాధితులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.