ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ఛాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌కోర్స్‌ ప్రారంభం - east point gold course at vishaka patnam

విశాఖలో గోల్ఫ్ మైదానం అత్యాధునిక వసతులను సంతరించుకుని అంతర్జాతీయ పోటీలకు సిద్దమైంది. ఛాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌ కోర్స్​ను నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పురాతమైన గోల్ఫ్ క్లబ్​లలో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఒకటని.. విశాఖలో 1884లోనే ఏర్పాటైందని అయన గుర్తు చేశారు.

golf course started at vishakapatnam
విశాఖలో ఛాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌కోర్స్‌ ప్రారంభం

By

Published : Feb 20, 2021, 6:00 PM IST

విశాఖలో ఛాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌ కోర్స్​ను నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేశారు. ముడసర్లోవ వద్ద 110 ఎకరాల్లో గోల్ఫ్ మైదానం అభివృద్ధి చేశారు. దేశంలోనే పురాతన గోల్ఫ్ క్లబ్‌లలో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఒకటి అని కరంబీర్​ సింగ్ వివరించారు. చక్కగా తీర్చిదిద్దిన హరిత కోర్టు వల్ల రాష్ట్రానికి, ప్రత్యేకించి విశాఖకు గోల్ఫ్​ టూరిజం పెరుగుతుందని అయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎ కేటగిరీ కోర్టుగా రూపకల్పన జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు రోజర్ బిన్ని, సయ్యద్ కిర్మాణీ పాల్గొన్నారు.

విశాఖలో ఛాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌కోర్స్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details