విశాఖ కేజీహెచ్‌లో కీర్తి(14) అనే బాలిక కరోనాతో మృతి చెందింది. మూడురోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుండి చికిత్స కోసం కేజీహెచ్‌కి తరలించారు. బాలికకు అందిస్తున్న చికిత్స సమాచారాన్ని తమకు తెలపలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం సీసీ టీవీ ఫుటేచ్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు జరుగుతున్నట్లు చూపించారని వాపోయారు.
నేడు బాలిక మృతి చెందినట్లు తెలియజేసారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో మృతురాలి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు.