విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. సొంత దస్తూరితో రాసిన లేఖను గతంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు.
రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా - విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వార్తలు
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. రాజీనామాను అంగీకరించాలని కోరారు.
రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా
ఈరోజు వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ద్వారా ఎమ్మెల్యేగా తన రాజీనామా లేఖ ప్రతుల్ని అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు గంటా శ్రీనివాసరావు అందించారు. తన రాజీనామా ఆమోదానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని గంటా లేఖలో కోరారు. లేఖను తాను స్పీకర్ ఫార్మాట్లోనే పంపించానని.. గంటా అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ ద్వారా వివరించారు.