తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్ అరెస్టుపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. కిశోర్ చేసింది దేశద్రోహమా అని ప్రశ్నించారు. ఆయనేమీ రక్షణ వ్యవహారాలు లీక్ చేయలేదన్న గంటా... సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్‌ను షేర్ మాత్రమే చేశారన్నారు.
నాపై కోపంతో... నా సన్నిహితులను ఇబ్బందిపెడతారా..?: గంటా - విశాఖపట్నం వార్తలు
సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ మెసేజ్ షేర్ చేసినందుకు తెదేపా సానుభూతిపరుడు కిశోర్‌ను అరెస్ట్ చేయటం దారుణమని మాజీమంత్రి గంటాశ్రీనివాసరావు మండిపడ్డారు. కిశోర్ చేసింది దేశద్రోహమా అని ప్రశ్నించారు.
మాజీమంత్రి గంటాశ్రీనివాసరావు
ఈమాత్రం దానికి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అర్ధరాత్రి మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేయడమేంటని నిలదీశారు. తనపై కోపంతో తన సన్నిహితులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రోజుకు వందల మెసేజ్‌లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయన్న గంటా... వ్యక్తుల పేర్లు కూడా ఎక్కడా వ్యక్తపరచలేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:తెదేపా సానుభూతిపరుడికి గంటా పరామర్శ
Last Updated : Jun 23, 2020, 12:36 PM IST