విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు.. రాజీనామాలే అస్త్రమని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా.. రాజీనామాలపై నేతలు ఇంకా ఆలోచించడాన్ని తప్పు పట్టారు. సీఎం జగన్ గట్టి నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు నడపాలని గంటా శ్రీనివాసరావు సూచించారు.
సీఎం జగన్ తగిన నిర్ణయం తీసుకోవాలి.. ఉద్యమాన్ని నడిపించాలి: గంటా - Ganta Srinivasa Rao News
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఈ పోరాటానికి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వ వహించాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు