ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భారీగా గంజాయి విక్రయాలు.. విద్యార్థులే టార్గెట్! - విశాఖ జిల్లా క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లాలో గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో గంజాయిని పోలీసులు దహనం చేశారు. రూ.100 నుంచి రూ.500 వరకు గంజాయి విద్యార్థులకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎస్‌.ఈ.బి. ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1625 కేజీల గంజాయిని స్వాధీనం చేసి, 55 కేసులు నమోదు చేసుకున్నారు.

ganja cases
ganja cases

By

Published : Dec 10, 2020, 8:14 AM IST

Updated : Dec 10, 2020, 9:12 AM IST

విశాఖ నగరంలో విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ప్రత్యేక నిఘా విభాగం) ఏడీసీపీ అజిత వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఎ.అర్జున్‌ (24), వి.భరత్‌ (23), జి.సిదిరాజు (27), నదీమ్‌ బాషా (23)లు విశాఖకు వచ్చి ఇక్కడ ద్విచక్ర వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వాటిపై మన్యం ప్రాంతాలకు వెళ్లి సుమారు 15 కేజీల గంజాయిని కొనుగోలు చేసి, విశాఖకు తీసుకువచ్చారు. 3 ప్యాకెట్ల రూపంలో ప్యాక్‌ చేసి తిరుపతికి బయలుదేరారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు షీలానగర్‌ వద్ద వీరిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కొబ్బరితోట ఎస్‌.వి.పి.నగర్‌లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. పి.దానయమ్మ (66), పి.శ్రీను (41), వై.భవాని (22), టి.నూకాలమ్మ (42)లు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని ఇళ్లను సోదాలు జరిపారు. సుమారు 24 కేజీల గంజాయి నిల్వ చేసినట్లు గుర్తించారు. వీటిలో 173 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. విడిగా గంజాయి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకు గంజాయి విద్యార్థులకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎస్‌.ఈ.బి. ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1625 కేజీల గంజాయిని స్వాధీనం చేసి, 55 కేసులు నమోదు చేశామన్నారు.

పాడేరులో భారీగా గంజాయి స్వాధీనం

విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న సుమారు 500 కిలోల గంజాయిని పాడేరు పోలీసులు పట్టుకున్నారు. పాడేరు సాయిబాబా గుడి సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ లారీ డ్రైవర్ తన వాహనం నిలిపివేసి పరారయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు సోదా చేశారు. లారీ క్యాబిన్​లో ప్రత్యేక పాత్రలో ఉన్న 200 ప్యాకెట్లు గంజాయిని గుర్తించారు. పోలీసులు గంజాయి, లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు

Last Updated : Dec 10, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details