ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో మళ్లీ మెుదలైన గ్యాంగ్ వార్! - viskhapatnam crime news

విశాఖ నగరంలో రౌడీ షీటర్ల ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమైంది. ఓ ముఠాలోని కీలక వ్యక్తుల హత్యలకు కుట్రలు చేస్తున్న కొందరి కదలికలు పసిగట్టిన టాస్క్​ఫోర్స్ పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు.

Gang War Starts in viskhapatnam
విశాఖలో మళ్లీ మెుదలైన గ్యాంగ్ వార్

By

Published : May 26, 2020, 10:38 AM IST

Updated : May 26, 2020, 11:03 AM IST

విశాఖ నగరంలో గ్యాంగ్ ‌వార్‌ మళ్లీ మొదలైంది. చాలా కాలం పాటు తెరవెనక్కు వెళ్లిపోయిన ముఠాలు మళ్లీ చురుగ్గా దందాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు ఆయుధాలతో బహిరంగంగానే తిరుగుతున్నాయి.

తాజాగా.. ఖాసిం (చనిపోయిన రౌడీషీటర్) ముఠాలోని కీలక వ్యక్తులను మట్టుబెట్టేందుకు చిట్టి మాము(రౌడీషీటర్) గ్యాంగ్‌ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని టాస్క్‌ఫోర్సు పోలీసులు అడ్డుకున్నారు.

మారణాయుధాలతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నగరంలో గ్యాంగ్‌ వార్‌ ఏ స్థాయిలో ఉందో బయటపడింది. వీరిపై కంచరపాలెం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

అమ్మా... నీ అనురాగం!

Last Updated : May 26, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details