ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మానవత్వం చాటిన బాల్య మిత్రుడు - Funeral for a friend who died with Corona

కరోనా సమయం అందరికీ పరీక్షలు పెడుతోంది. వారి గుణగణాలను తేటతెల్లం చేస్తోంది. కొవిడ్ తో మృతి చెందిన పార్థివ దేహాన్ని దహనం చేసేందుకు కుటుంబ సభ్యులే రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటువంటి స్థితిలో... తన బాల్యమిత్రుడికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటాడు ఓ ప్రొఫెసర్.

Funeral for a friend who died with Corona
Funeral for a friend who died with Corona

By

Published : May 16, 2021, 12:41 PM IST

విశాఖకు చెందిన గోవిందరావు ప్రముఖ ఇంజినీరు. చాలా మందికి ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలుసు. సమాజంలో మంచి పేరుంది. ఈయన కరోనాతో ఇటీవల కన్ను మూశారు. ఈయన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. కరోనా వల్ల వారు వచ్చేందుకు వీలు లేకపోయింది. మామూలు సమయంలో ఆయనకు ఉన్న పరిచయాలకు కనీసం వెయ్యి మంది అంతిమయాత్రకు తరలి వచ్చే వారు. కొవిడ్ కావడం వల్ల ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత్యక్రియలకు సంబంధించి అన్నీ కాంట్రాక్ట్ కి ఇచ్చేశారు.

శ్మశాన వాటిక వద్ద మాత్రం ఒక బాధ్యులు సంతకం చేయడం తప్పనిసరి. కేజీహెచ్ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావుకు... కొవిడ్ బారిన పడి కన్ను మూసిన ఆనందరావు స్నేహితుడు. తన మిత్రుడి మరణంతో చలించిపోయిన ఆయన... ఒక్కరే శ్మశాన వాటికకు వెళ్లారు. బరువెక్కిన హృదయంతో అక్కడ సంతకం చేశారు. తన స్నేహితుడి భౌతిక కాయానికి తానే చితికి నిప్పంటించారు. మానవత్వాన్ని చాటారు.

ABOUT THE AUTHOR

...view details