ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెతికి మరీ.. అన్నార్తుల ఆకలి తీరుస్తారు! - విశాఖ తాజా వార్తలు

ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడమే నిజమైన దైవ సేవ అంటారు పెద్దలు. ఇదే మాటను ఆచరణలో పెట్టి ఉత్తమ సేవలు అందిస్తున్నారు.. ఓ ఇద్దరు మిత్రులు. ఒకరేమో ఓ చిన్న భోజనశాల నడిపే వ్యక్తి కాగా.. ఇంకొకరు చిరు వ్యాపారం చేసే వ్యక్తి. వీరిద్దరు కలిసి పుష్కరకాలంగా అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు. వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల కడుపు నింపే క్రతువును వీరు.. తమ కుటుంబాల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగించారు. ఆకలితో ఉన్న వారిని ఆదుకుని మానవత్వానికి ప్రతిరూపాలుగా మారారు. వీరు చేస్తున్న సేవలను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. ఇంతకీ... వారు ఎవరు? ఎందుకు వారికింత ప్రత్యేకత?

free food distribution to orphans at narsipatnam
వెతికి మరీ.. అన్నార్తల ఆకలి తీరుస్తారు!

By

Published : Jan 5, 2021, 3:29 PM IST

Updated : Jan 5, 2021, 6:55 PM IST

జీవనోపాధి నిమిత్తం ఒడిశా నుంచి విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన రాధా రమణ, అతని మిత్రుడు కొండబాబు.. 12 ఏళ్లుగా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదల ఆకలి తీరుస్తున్నారు. రాధా రమణ ప్రస్తుతం బ్యాంకు కాలనీలో కేటరింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందులో వచ్చే ఆదాయంలో కొంత వెచ్చించి అభాగ్యుల కడుపు నింపుతున్నారు. కొండబాబు గొలుగొండ మండలం చిట్టిగుమ్మలో చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

ఆహారాన్ని పంచుతున్న కొండబాబు

అన్నార్తులకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తూ నిస్సహాయ స్థితిలో ఉండే వారి కడుపు నింపుతున్నారు వీరిద్దరు. అయితే వీరి సహాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆకలిగా ఉందని చెప్పలేని వారిని.. దయనీయ స్థితిలో రోడ్ల పక్కన, బస్టాండ్లో, పాడుపడిన భవనాల వద్ద ఉండే వారిని... వెతికి మరీ వీరు ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు రాధా రమణ వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను కొండబాబు మోటార్ సైకిల్​పై ఊరంతా తిరిగి పంపిణీ చేస్తూ ఉంటారు. తొలి రోజుల్లో తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం రోజుకి 40 మంది ఆకలి తీర్చే స్థాయికి విస్తరించింది. ఈ సేవల కోసం నెలకు రాధా రమణ సుమారు 40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.

పంచేందుకు సిద్ధంగా ఉంచిన ఆహారం

ఆశ్రమం ఏర్పాటే లక్ష్యం..

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని గోపాల బాబా ఆశ్రమంలో నిత్యాన్నదానం చూసి స్ఫూర్తి పొందానని రాధా రమణ పేర్కొన్నారు. ఆశ్రమంలో కలిసిన కొండబాబు సహకారంతో ఇప్పటివరకు అభాగ్యులను ఆదరించి ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని.. దాతలు సహకారం అందిస్తే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు రోజూ భోజనాలు సమకూర్చగలమని చెప్పారు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేయాలన్నది తన జీవిత లక్ష్యమన్నారు.

ఇదీ చదవండి:
వరి కంకులను పేర్చి.. పిచ్చుకల ఆకలి తీర్చే..

Last Updated : Jan 5, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details