ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Undavalli: "జగన్‌ కొత్త తరహా క్విడ్‌ ప్రోకోకి తెరలేపారు" - విశాఖ తాజా వార్తలు

Undavalli arun kumar: సంక్షేమ పథకాల పేరుతో పేదలకు డబ్బు పంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ కొత్త తరహా క్విడ్‌ ప్రోకోకి తెరలేపారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. ఒక ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా చేస్తున్న పనులకు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. సీఎం జగన్‌ ఓ వ్యాపార వేత్త అన్న ఉండవల్లి.. లాభాపేక్ష లేకుండా ఏ పనీ చెయ్యరని వ్యాఖ్యానించారు.

Undavalli arun kumar
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

By

Published : Apr 15, 2022, 8:15 PM IST

Undavalli arun kumar: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్‌ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. "జాతీయ ప్రాజెక్టును కేంద్రం కట్టి ఇవ్వాలి. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన జగన్‌... ఇప్పుడు ఎందుకు అదే కొనసాగిస్తున్నారు. ఈయన ప్రభుత్వం రాగానే కేంద్రానికి స్వాధీనం చేయాలి. ఆంధ్రాలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకు ఇక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టడమని కేంద్రం భావిస్తోంది. మన ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా? ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు." అని ఉండవల్లి నిలదీశారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

"ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాలి. ఇదే జగన్‌ విధానం. అసలు క్విడ్‌ ప్రోకో అంటే ఇదే. ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వరు. ఈ విధానంలో జగన్‌ సక్సెస్‌ అవుతారా? ఫెయిల్‌ అవుతారా? అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి గ్యాంబ్లింగ్‌ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఎంతకాలం డబ్బులు పంచగలడు? ఎక్కడ్నుంచి తేగలడు? కేంద్రం నిధుల మళ్లింపుపై విచారణ జరుగుతోందట. విచారణలో ఫలితం ఏమొచ్చినా.. జగన్‌ ఏమీ ఫీల్‌ కారు. ఎందుకంటే.. పేద ప్రజలకు ఇచ్చానంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంవల్లే విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది" అని ఉండవల్లి అరుణ్ కుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి:Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'

ABOUT THE AUTHOR

...view details