విశాఖలో ఇన్సైడ్ ట్రేడింగ్‌పై వైకాపా నేత విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. గత 2 రోజులుగా తెదేపా నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విశాఖలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఆశీల్ మెట్టపై ఉన్న క్రైస్తవ మిషనరీ సంస్థకు చెందిన భూమిని.. దిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్‌తో కలిసి అగ్రిమెంట్ చేయించలేదా అని ప్రశ్నించారు. విశాఖ కార్తీకవనంలో భూమిని రేయన్స్ హోటల్‌కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
'క్రైస్తవ మిషనరీ భూమి సంగతేంటి విజయసాయిరెడ్డీ? ' - విజయసాయిరెడ్డిపై తెదేపా నేత బండారు సత్యనారాయణ విమర్శలు
అమరావతిలో కాదు.. విశాఖలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగిందనీ.. దీనిపై విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని.. తెదేపా నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.
బండారు సత్యనారాయణమూర్తి
Last Updated : Dec 27, 2019, 11:14 AM IST