ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి' - విశాఖ స్టీల్ ప్లాంట్ వార్తలు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. కర్మాగారం కోసం రైతులు ఇచ్చిన భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం మానుకోవాలని సూచించారు.

former minister daadi veerabhadrarao on vizag steel plant
దాడి వీరభద్రరావు

By

Published : Dec 15, 2019, 11:32 AM IST

దాడి వీరభద్రరావు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టీల్ ప్లాంట్ స్థలాన్ని సౌత్ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి ఇస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కర్మాగారం కోసం రైతులు ఇచ్చిన భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం మానుకోవాలని.. లేకుంటే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details