ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వండర్ కిడ్స్..కేరాఫ్ విశాఖ

విశాఖలోని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు తమ మేథస్సుతో అందరినీ మైమరపిస్తున్నారు.

visakhapatnam

By

Published : Feb 18, 2019, 7:04 AM IST

విశాఖలోని వండర్ కిడ్స్
నేటి బాలలే రేపటి పౌరులు ...వారిని చూస్తే ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. చూడటానికి చిన్నగా కనిపించినా..పెద్దవారిలాగే అద్భుతాలు చేస్తారు. చదివేది తక్కువ తరగతులే అయినా వండర్లు సృష్టించి వండర్ కిడ్స్ గా పేరు తెచ్చుకున్నారు. వారే...విశాఖలోని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు.
ఆనందంగా బడికి వెళ్లే పిల్లలే చదువుల్లో చురుగ్గా ఉంటారన్న సూత్రాన్ని స్కూలు యాజమాన్యం పాటిస్తోంది.. ఇదే విషయాన్ని అమలు చేసి.. విద్యార్థులను మెరికల్లా తయారు చేస్తున్నారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పేరుకు తగ్గట్లే వీరి బోధనా పద్ధతులూ ఉంటాయి. పుస్తకాలు లేకుండా...హోంవర్కు ఇవ్వకుండా సుశిక్షితులైన గురువులే పాఠాలు చెప్తారు.

తెలుగు భాషపై ఈ వండర్ బాలలు పట్టు పెంచుకున్నారు. గలాగలా పద్యాలు చెబుతారు. అక్షర దోషాలు లేకుండా ఉచ్ఛారణ చేస్తారు. వేమన, దాశరథి కవుల శతకాలను ఆలపిస్తారు. ప్రపంచ పటంలోని దేశాలన్నింటినీ చెప్తారు. ఏ దేశం ఎక్కడుందో చూపిస్తారు. వీరి ప్రతిభా పాటవాలను లెక్కించడానికి పలు బుక్ ఆఫ్ రికార్డ్సు పరిశీలన కూడా జరుపుతున్నాయి. రేపటి వేగానికి సరిపడేలా విద్యాపాఠవాలు నేర్చుకుని వీరు దూసుకుపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details