ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ సాగరంలో ఫ్రాన్స్ దేశీయుల స్వచ్ఛసేవ..! - విశాఖ సాగరంలో విదేశీయుల స్వచ్ఛ సేవ

విశాఖ తీరంలో విదేశీయులు స్వచ్ఛసేవ నిర్వహించారు. ప్రధాని ప్రశంసలు అందుకున్న ప్లాటిపస్ ఎస్కేప్స్ సంస్థకు చెందిన బృందంతో కలిసి స్వచ్ఛసేవలో పాల్గొన్నారు.

Foreigners have disposed of garbage in the Vishakha Sea
సాగర తీరంలో విదేశీయులు

By

Published : Nov 29, 2019, 11:16 PM IST

విశాఖ సాగరంలో ఫ్రాన్స్ దేశీయుల స్వచ్ఛసేవ..!

ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖ తీరంలో వ్యర్థాలను తొలగించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు చెందిన ప్లాటిపస్ ఎస్కేప్స్ సంస్థకు చెందిన స్కూబా డైవర్ల బృందాన్ని ప్రశంసించారు. ఇప్పుడు ఫ్రాన్స్ దేశీయులు అలెక్స్, టాంగీ స్వచ్ఛసాగరం లక్ష్యంగా చేస్తున్న యత్నంలో భాగస్వాములు అయ్యారు. వినూత్న ఆలోచనలో తోడుకావడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సాగర తీరాల్ని, సముద్ర గర్భాల్ని కాలుష్యరహితంగా ఉంచేందుకు ప్రజల బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాటిపస్ బృందంతో కలిసి అలెక్స్, టాంగీ 40 కేజీలకుపైగా వ్యర్థాలను సముద్రం బయటకు తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details