Milan-2022: మిలన్-2022కు దేశానికి వచ్చిన విదేశీ నౌకాదళ సిబ్బందిని బౌద్దగయ, అగ్రాలకు భారత నౌకాదళం తీసుకువెళ్లింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మహాబోధి దేవాలయం, 80 అడుగుల బుద్ద విగ్రహం ప్రాంతాలలో విదేశీ నౌకాదళాల సిబ్బంది పర్యటించారు. అగ్రాలో తాజ్ మహల్, ఆగ్రాఫోర్టు, కళాకృతి సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు.
Milan-2022: దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విదేశీ నౌకాదళం.. - ఆగ్రాలో పర్యటించిన విదేశీ నేవి
Milan-2022: మిలన్ ఉత్సవాల్లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన నౌకాదళ సిబ్బందిని భారత నౌకాదళం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రాచీన, సంస్కృతి, సంప్రదాయ కట్టడాలను, సాంస్కృతిక కేంద్రాలకు వారికి తీసుకెళ్లారు.
తాజ్మహల్ వద్ద నేవీ సిబ్బంది