ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fog In Vishaka: మన్యంలో మంచుదుప్పటి... ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు

fog at mannyam: వేసవికాలం వస్తోంది. భగభగమండే ఎండతో.. ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే అనుకుంటున్నారు అందరూ.. కానీ విశాఖ జిల్లా మన్యంలో పొగమంచు తగ్గడం లేదు. రథసప్తమి ప్రవేశించినా అక్కడి మైదాన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుని చూపరులను ఆకర్షిస్తోంది. వాహనదారులు కాస్త ఇబ్బందులు పడుతున్నా... మంచుపొరల దృశ్యాలు అందరికీ ఆనందాన్నిస్తున్నాయి.

fog
విశాఖ మన్యంలో పొగమంచు

By

Published : Feb 10, 2022, 12:08 PM IST

మన్యంలో పొగమంచు

fog at mannyam: శీతాకాలం ముగిసి వేసవి వచ్చేస్తున్న సమయంలోనూ మన్యంలో పొగమంచు తగ్గడం లేదు. రథసప్తమి మొదలైనా మైదానాల్లో పొగమంచు తెరలు దట్టంగా అలుముకుంటున్నాయి. మంచు తెరల్లో.. మన్యం వాతావరణం ఎంతో రమణీయంగా కన్పిస్తోందని చూపరులు చెబుతున్నారు. మంచు పక్కకు వెళుతూ.. సూర్యుడు ఉదయిస్తున్న ఆ అందమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

fog at mannyam: ప్రధానంగా విశాఖ జిల్లా నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం మండలాల్లో భీమునిపట్నం-నర్సీపట్నం రహదారిలో పొగమంచు ఎంతగానో ఆకర్షిస్తోంది. ఉదయం 7 గంటల సమయంలోనూ మంచు తగ్గలేదు. వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణించాల్సి వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details