సెల్ఫీల సందడి...
అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న పుష్ప ప్రదర్శన - flower show vishakha ustsav
విశాఖ ఉత్సవ్ తొలిరోజు సంబరాలు అంబరాన్నంటాయి. సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణలు చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా అలరించాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు గాయనీగాయకులు తమ గానాలతో ఆకట్టుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా విశాఖ వాసులు ఉత్సవ్‌ను ఆస్వాదించారు.

అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కు మొత్తం విద్యుత్ ధగధగలతో మెరిసిపోయింది. వేడుకలను తిలకించేందుకు వచ్చిన నగర వాసులతో కిక్కిరిసిపోయింది. పార్కులోని ఆకర్షణలను తమ చరవాణిల్లో బంధించేందుకు నగరవాసులు పోటీపడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో నేడు గవర్నర్ బిశ్వభూషణ్ పాల్గొననున్నారు.
Last Updated : Dec 29, 2019, 6:36 AM IST