ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AIRPORT: విశాఖ విమానాశ్రయంలో యధావిధిగా విమాన రాకపోకలు.. - flights started in vishaka airport

విశాఖ విమానాశ్రయంలో ముంపు ముప్పు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం విమానాల రాకపోకలు యథాతధంగా ఉన్నాయి.

flights
విశాఖ విమానాశ్రయం

By

Published : Sep 28, 2021, 10:27 AM IST

విశాఖ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పూర్తిగా నిండడం వల్ల నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదలచేస్తున్నారు. విమానాశ్రయానికి నిన్న ఎదురైన ముంపు ముప్పు లేకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎయిర్ పోర్టు అధారిటీ, జిల్లా యంత్రాంగం సమీక్షిస్తున్నారు. విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి.

విశాఖ నుంచి విమానాల రాకపోకలు యథాతధంగా కొనసాగుతున్నాయి. ఏ విమానాలు రద్దు కాలేదని విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మొత్తం 22 సర్వీసులు యధావిధిగా నడుస్తున్నాయి. విమానాశ్రయ ఆపరేషన్లకు ఎటువంటి ఆటంకం లేదన్నారు. రన్ వే వైపుగాని ఎయిర్​ పోర్ట్ మెయిన్ గేట్ వైపుగాని నీరు నిలిచిపోయిన పరిస్థితి లేదని వివరించారు. మేఘాద్రి గడ్డ నుంచి వస్తున్న నీటి వల్ల ఎయిర్ పోర్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకుందని చెప్పారు.

మరోవైపు విశాఖలోని చోడవరంలోని వినాయక ఆలయం గర్భగుడిలో వర్షపు నీరు చేరింది. గర్భగుడి నుంచి నీటిని అర్చకులు బయటకు తోడుతున్నారు. ఈ ప్రాంతంలోని 1,256 ఎకరాల్లోని పంట నీటమునిగింది. తాళ్లపాలెం జాతీయ రహదారిపై నీటిప్రవాహం, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండీ..AP RAINS: గులాబ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షం

ABOUT THE AUTHOR

...view details