ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 16 నుంచి విశాఖకు ఎనిమిది దేశాల విమానాల రాక - flight services in visakha news

విశాఖకు ఈనెల 16 నుంచి ఎనిమిది దేశాలకు చెందిన విమానాలు రానున్నాయి. కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని 12 విమానాల ద్వారా స్వదేశానికి రప్పించున్నారు. మంగళవారం రాత్రి తొలి విమానం విశాఖకు రానుంది.

ఈనెల 16 నుంచి విశాఖకు ఎనిమిది దేశాల విమానాల రాక
ఈనెల 16 నుంచి విశాఖకు ఎనిమిది దేశాల విమానాల రాక

By

Published : Jun 15, 2020, 3:41 AM IST

విశాఖకు ఈ నెల 16 నుంచి ఎనిమిది దేశాలకు చెందిన విమానాలు రానున్నాయి. వందే భారత్ మిషన్ 3లో భాగంగా ఈ విమానాలు విశాఖకు చేరుకుంటాయి. వివిధ దేశాల్లో కోవిడ్ కారణంగా చిక్కుకుపోయిన తెలుగు వారిని 12 విమానాల ద్వారా రప్పించనున్నారు. మంగళవారం రాత్రి తొలి విమానం వస్తుండగా.... ఈ నెల 29 వరకు వివిధ షెడ్యూళ్లలో విమానాలు వస్తాయి. ఫిలిప్పీన్స్, కిర్గీస్థాన్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, యూకే నుంచి విమానాలు రానున్నట్లు విశాఖ విమానాశ్రయ డైరెక్టర్ రాజా కిషోర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details