ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో విద్యార్థులకు డ్రగ్స్ అమ్మకం.. ముఠా అరెస్టు - విశాఖ జిల్లా క్రైమ్ వార్తలు

విశాఖలో డ్రగ్స్ దందా సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి లైసర్జిక్అభివృద్ధికి చిరునామాగా ఉన్న విశాఖలో.. డ్రగ్స్‌ చలామణీ అలజడి రేపుతోంది. విద్యార్థులే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాల వ్యాపారం సాగిస్తున్నారు. అలాంటి ఓ ముఠా ఆట కట్టించిన పోలీసులు, విద్యార్థుల్లో అవగాహన పెంచే చర్యలకు ఉపక్రమించారు. యాసిడ్ డైఇథైలమైడ్(ఎల్‌ఎస్‌డీ) బోల్ట్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

vsp_ drugs
vsp_ drugs

By

Published : Nov 23, 2020, 12:05 PM IST

విశాఖలో విద్యార్థులకు డ్రగ్స్ అమ్మకం.. ముఠా అరెస్టు

విశాఖలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. 27 మత్తు పదార్థ పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీని బిట్ కాయిన్లుగా మార్చి అంతర్జాలం ద్వారా ఎల్​ఎస్​డీ అనే మత్తు పదార్థాన్ని ప్రధాన నిందితుడు అరవింద్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 4 వందల రూపాయలకు కొనుగోలు చేసి, మిగిలిన నిందితులకు వెయ్యికి విక్రయిస్తుంటాడని తెలిపారు.

వారు 2 వేల రూపాయల చొప్పున విద్యార్థులకు అమ్ముతారన్నారు. 16 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసువారే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోందని.. సీపీ మనీష్ కుమార్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సహా పలు ప్రైవేటు వర్సిటీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలకు నిలయంగా ఉన్న విశాఖలో.. డ్రగ్స్‌ చలామణీ ఆందోళన రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన యువకులు ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు కావడమే ఇందుకు నిదర్శనం. విద్యార్థులుగా ఉన్నపుడే మత్తుకు బానిసలైన వారు.. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారు.

డ్రగ్స్‌ అనర్థాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలు, యువతలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఓ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. డ్రగ్స్‌ మూలాలను ఛేదించే దిశలో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టడంపై పోలీసులు దృష్టి సారించారు.

ఇదీ చదవండి:

నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details