Fishermen విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్య కార పారిశ్రామిక సంక్షేమ సంఘం తరుపున నిర్వహించిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. విశాఖ కంటైనర్ టెర్మినల్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని.. తమకు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం నుంచి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సముద్రంలో సైతం మర పడవులను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు వాణిజ్య ఓడలు రాకుండా అడ్డుకున్నారు. హామీ నేర వేర్చడానికి ఈ నెల 20 వతేది గడువు ఇచ్చినా, భెఖాతారు చేయడం వల్ల నిరసన చేస్తున్నట్టు మత్స్యకార నాయకులు వెల్లడించారు. ఆందోళనలు ఉదృతంగా మారడంతో.. టెర్మినల్ లోని సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది పడవలతో వారిని అడ్డుకున్నారు. మత్స్యకారులను రాళ్లతో కొట్టడంతో నిరసన మరింత ఉద్రిక్తంగా మారింది.
Vizag: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళనలు.. - 0 ఏళ్ల క్రితం వారు ఇచ్చిన భూములకు పరిహారం
Fishermen: విశాఖ కంటైనర్ టెర్మినల్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని.. టెర్మినల్ ప్రధాన గేటు వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. సముద్రంలోనూ వాణిజ్య ఓడలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. భద్రతా సిబ్బంది, మత్స్యకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
మత్స్యకారుల ఆందోళన