కొన్ని నెలలు క్రితం బంగ్లాదేశ్ సముద్ర జల్లాలోకి ప్రవేశించిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. అమృత ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయంపై బంగ్లాదేశ్‌తో చర్చలు జరిపింది. అరెస్టయిన మత్స్యకారులను జనవరి 29 బంగ్లాదేశ్ విడుదల చేసింది. ఫిషింగ్ బోట్ ఆ దేశం అధీనంలోనే ఉంది. ఇప్పుడు బోట్తోపాటు అక్కడే ఉన్న మత్య్యకారుడు వాసుపల్లి అప్పన్నను విడుదల చేసింది. చాలారోజుల కిందటే మత్య్సకారులు తమ ఇళ్లకు చేరుకోగా... బోట్‌తో ఉన్న అప్పన్న విశాఖకు చేరుకోవడానికి ఆలస్యమైంది.
బంగ్లాదేశ్‌కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది - విశాఖకు చేరుకున్న మత్స్యకారులు న్యూస్
చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన విశాఖ మత్స్యకారుడు వాసుపల్లి అప్పన్న విశాఖ చేరుకున్నాడు. అప్పన్న బృందానికి చెందిన అమృత పేరుతో ఉన్న బోట్ విశాఖ చేరుకుంది.
fishermen and fishing boat release from bangladesh