పార్కింగ్ చేసిన కారులో మంటలు
పార్కింగ్ చేసిన కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం - పార్కింగ్ చేసిన కారులో మంటలు
Fire in Car: విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం జరిగింది. షీలా నగర్ కృషి ఐకాన్ ఆస్పత్రి పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో.. అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

car fire