విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లో అగ్ని ప్రమాదం - fire accident in visakapatnam news
22:42 January 27
వంట నూనెల కంపెనీలో అగ్నిప్రమాదం
విశాఖలోని అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం రాత్రి 10.30 అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్యాకింగ్ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫార్మాసిటీ నుంచి వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెస్తున్నాయి.
ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ కంపెనీలో డబ్బాలు, ప్యాకెట్లలోకి నూనెను నింపుతారు. దువ్వాడ సీఐ పి.లక్ష్మి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అటువైపుగా ఎవరినీ రానీయడం లేదు.