ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire Accident: కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రాణ నష్టం - కారులో చెలరేగిన మంటలు వార్తలు

కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన విశాఖ మధురవాడలో జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించటంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

1
1

By

Published : Oct 22, 2021, 10:42 PM IST

విశాఖలోని మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద షార్ట్ సర్క్యూట్​తో కారులో మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు స్పందించడంతో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. వారికి ఎటువంటి హాని జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా..మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రాణ నష్టం

ABOUT THE AUTHOR

...view details