ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై.. కలెక్టర్​కు నివేదిక - విశాఖ

విశాఖ హార్బర్‌లో పెను ప్రమాదం తప్పింది. సివిల్ పనుల కోసం పని వారిని తీసుకెళ్లే టగ్‌లో మంటలు చెలరేగి ఐదుగురు గాయపడ్డారు.

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఐదుగురికి గాయాలు

By

Published : Aug 12, 2019, 2:29 PM IST

Updated : Aug 12, 2019, 8:28 PM IST

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఒకరు గల్లంతు

విశాఖ ఔటర్ హార్బర్‌లో టగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు రావడంతో టగ్‌లోని పనివారు, సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయినా వారికి గాయాలయ్యాయి. సముద్రంలో దూకిన వారిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించింది. ప్రమాద సమయంలో టగ్‌లో 29మంది ఉన్నారని కోస్టు గార్డు వెల్లడించింది. 28మందిని రక్షించి పోర్టు అధికారులకు అప్పగించారు. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సహాయకచర్యల్లో రాణి రోష్మణి, చార్లిసి 432 నౌకలు పాల్గొన్నాయి.

ఏడుగురి పరిస్థితి విషమం

ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందికి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్ధితి విషమంగా ఉందని ఏసీపీ కులశేఖర్ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌కు చమురు పైపు అనుసంధానం చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

కమిటీ విచారణ

టగ్‌లో ప్రమాదాన్ని కలెక్టర్ వినయ్​చంద్ ప్రభుత్వానికి నివేదించారు.ప్రమాద కారణాలపై జేసీ-2 వెంకటేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించారు. పరిశ్రమల కేంద్రం జీఎం,ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో కూడిన కమిటీ విచారణ చేయాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి..

జియో గిగా ఫైబర్​తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్​డే ఫస్ట్​ షో'

Last Updated : Aug 12, 2019, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details