fire accident: విశాఖ జిల్లా పాడేరు ఎక్సైజ్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వివిధ కేసుల్లో పట్టుబడిన నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి. ఎక్సైజ్ కార్యాలయం పక్కన ఉన్న మైదానంలో.. వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలను ఉంచుతారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వందలాది వాహనాలు ఇక్కడ ఉన్నాయి.
బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో.. ఒక జీపు, కారు, రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండొచ్చని.. ఎక్సైజ్ సిబ్బంది భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది మూడో ప్రమాదం.