విశాఖ జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో.. అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని.. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ సందర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీల్ నరసింహరావుతో కలిసి అల్లూరి సమాధి వద్ద అంజలి ఘటించారు.
అల్లూరి అనుచరుడు గంటం దొర సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. తెల్లదొరలపై దండెత్తిన వీరులందరికీ జోహార్లు అర్పించారు. అల్లూరి తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహానికి పూలమాల వేసి భారత్ మతాకీ జై అంటూ నినదించారు. అనంతరం చిన్నారులతో కాసేపు సంభా,ించారు. అల్లూరి ఘన చరితను గుర్తు చేసుకున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం
చిన్న వాల్తేర్లోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన.. మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు ఆమె చెప్పారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగానే వ్యాక్సినేషన్ ఇస్తోందన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకూ అనుమతి లభించిందని.. త్వరలోనే వాటిని సైతం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
మంత్రిని కలిసిన దళిత సంఘాల ఐక్య వేదిక సమితి