ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FTPC: లఘుచిత్ర బృందాన్ని సత్కరించిన ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ - unlucky short film

'అన్ లక్కీ షర్ట్' అనే లఘు చిత్రం ఆరు అంతర్జాతీయ, పలు దేశీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించి విమర్సకుల ప్రశంసలు అందుకుంది. ఈ లఘు చిత్ర బృందాన్ని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఘనంగా సత్కరించింది. చిత్ర దర్శకుడు సురంజన్ దె, కథానాయకి, బాలీవుడ్ నటి శుభశ్రీ కౌర్​లను కౌన్సిల్ సభ్యులు సత్కరించారు. తెలుగు, బెంగాలీ చిత్ర బంధం మరింత విస్తృతం అవ్వడానికి కృషి చేయనున్నట్లు కౌన్సిల్ తెలిపింది.

FTPC
FTPC

By

Published : Nov 7, 2021, 7:10 PM IST

పశ్చిమ బంగాలో జర్నలిస్టుగా జీవితం గడిపిన సురంజన్ దె.. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సహజ అంశాలను ఆధారంగా తీసుకుని శుభ శ్రీ కౌర్ నాయకిగా 'అన్ లక్కీ షర్ట్' అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివెల్స్​లో ప్రదర్శన ఇచ్చింది. అలాగే దేశీయంగా మరిన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ లఘు చిత్ర దర్శకులు సురంజన్ దె, చిత్ర కధానాయకి శుభ శ్రీ కౌర్ లను సత్కరించారు. తెలుగు బెంగాలీ చిత్ర సమాగమనంగా కౌన్సిల్ సభ్యులు అభివర్ణించారు. కథానాయకి శుభ శ్రీకి మంచి గుర్తింపు మునుముందు వస్తుందని ఆశాభావం వక్తం చేసారు. నటీనటులను ప్రోత్సహించాలని టీవీ సినిమా రంగాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సురంజన్ మరియు శుభశ్రీ లను సత్కరిస్తునట్టు చెప్పారు.

''తీసిన లఘు చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఫిలిం అండ్ టీవీ ప్రమోషన్ కౌన్సిల్ ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి సినీ దర్శకుడిగా ఎదగడం ఆనందంగా ఉంది.'' - సురంజన్ దె, అన్ లక్కీ షర్ట్ ,చిత్ర దర్శకుడు

''ఫిలిం అండ్ టీవీ ప్రమోషన్ కౌన్సిల్ ఇస్తున్న ప్రోత్సాహానికి సంతోషం. అన్ని భాషల్లో చిత్రాలు నిర్మాణం జరగాలని కోరారు. విశాఖలో సుందర ప్రదేశాలు చూస్తే ఆనందం కలిగింది. త్వరలో బంగాలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.'' - శుభ శ్రీ కౌర్, బంగాలీ నటి, మోడల్

ఇదీ చదవండి:తల్లిని చంపిన తనయుడు.. కేసు ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details