ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డిసెంబరు చివరి వరకు.. ప్రత్యేక రైలు సర్వీసులు పొడగింపు

By

Published : Nov 30, 2020, 7:51 PM IST

తూర్పు కోస్తా రైల్వే నడిపే అన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ప్రత్యేక రైలు సర్వీసులు డిసెంబరు చివరి వరకు పొడగింపు
ప్రత్యేక రైలు సర్వీసులు డిసెంబరు చివరి వరకు పొడగింపు

తూర్పు కోస్తారైల్వే నడిపే అన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.

తూర్పు కోస్తానుంచి నడుస్తున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి

  • 08479/08480 భువనేశ్వర్-తిరుపతి (వారాంతపు ప్రత్యేక రైలు) ప్రతి శనివారం భువనేశ్వర్ నుంచి ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది.
  • 02839/02840 భువనేశ్వర్-చెన్నై-భువనేశ్వర్ (వీక్లీ స్పెషల్) ప్రతి గురువారం భువనేశ్వర్ నుంచి, శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరుతుంది.
  • 02845/02846 భువనేశ్వర్ - బెంగళూరు; కంటోన్మెంట్- భువనేశ్వర్ (వీక్లీ స్పెషల్) ప్రతి ఆదివారం భువనేశ్వర్ నుంచి, ప్రతి మంగళవారం బెంగళూర్ కంటోన్మెంట్ నుంచి బయలుదేరుతుంది.
  • 02898/02897 భువనేశ్వర్ - పుదుచ్చేరి - భువనేశ్వర్ (వీక్లీ ప్రత్యేక రైలు) మంగళవారం భువనేశ్వర్ నుంచి, బుధవారం పుదుచ్చేరి నుంచి బయలుదేరుతుంది.
  • 05.08496/08495 భువనేశ్వర్ - రామేశ్వరం- భువనేశ్వర్ (వీక్లీ ప్రత్యేక రైలు) ప్రతి శుక్రవారం భువనేశ్వర్ నుంచి ప్రతి ఆదివారం రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది.
  • 02859/02860 పూరి - చెన్నై- పూరి (వారాంతపు ప్రత్యేక రైలు) ప్రతి ఆదివారం పూరి నుంచి , ప్రతి సోమవారం చెన్నై నుంచి బయలు దేరుతుంది.
  • 02851/02852 విశాఖ- నిజాముద్దీన్ - విశాఖ (బైవీక్లీ ఎక్స్​ప్రెస్) విశాఖ నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లలోనూ, నిజాముద్దీన్ నుంచి బుధ,ఆదివారాల్లో బయలు దేరుతుంది.
  • 02887/02888 విశాఖ- నిజాముద్దీన్ -విశాఖ ప్రతి మంగళ, బుధ , గురు, శని, ఆది వారాల్లో విశాఖ నుంచి, సోమ, మంగళ, గురు, శుక్ర, శని వారాల్లో నిజాముద్దీన్ నుంచి ఈ రైలు బయలు దేరుతుంది.
  • 02869/02870 విశాఖ- చెన్నై -విశాఖ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం, చెన్నై నుంచి ప్రతి మంగళ వారం బయలుదేరుతుంది.
  • 02857/02858 విశాఖ - ఎల్​టీటీ (ప్రత్యేక రైలు) ప్రతి ఆదివారం విశాఖ నుంచి, ఎల్​టీటీ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది.
  • 08501/08502 విశాఖ పట్నం- గాంధీగ్రామ్ -విశాఖపట్నం (ప్రత్యేక రైలు) ప్రతి గురువారం విశాఖ నుంచి ,ప్రతి అదివారం గాంధీ గ్రామ్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది.
  • 07488/07487 విశాఖ- కడప - విశాఖ ప్రతి రోజూ డిసెంబర్ 31 వరకు ప్రత్యేక రైలుగా నడుపుతారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details