ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నవయసులో రాణిస్తున్న యువ దర్శకుడు డెన్నిస్ జీవన్ - యువ దర్శకుడు డెన్నిస్ జీవన్​కు సన్మానం

యువ దర్శకుడు డెన్నిస్ జీవన్.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్​ కుమార్ ప్రశంసించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో డెన్నిస్ జీవన్​ను ఘనంగా సన్మానించారు.

felicitation to young director
యువ దర్శకుడు డెన్నిస్ జీవన్

By

Published : Mar 29, 2021, 6:07 PM IST

చిన్న వయసులోనే చలనచిత్ర రంగంలో రాణిస్తున్న యువ దర్శకుడు డెన్నిస్ జీవన్​ను ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్​ కుమార్ ప్రశంసించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో ఓ కళాశాలలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. యువ దర్శకుడు డెన్నిస్.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

2018లో ప్రపంచ మహిళా సదస్సులో జరిగిన లఘు చిత్ర పోటీలో ఉత్తమ లఘు చిత్రం పురస్కారాన్ని డెన్నిస్ జీవన్ అందుకున్నారు. సందీప్ ‌కిషన్‌ కథానాయకుడు, లావణ్య త్రిపాఠి నాయికగా డెన్నిస్ జీవన్ రూపొందించిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' ప్రేక్షకుల మన్ననలను అందుకుందని కిషోర్ గుర్తుచేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల సంచాలకులు గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details