విశాఖపట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముటున్న ఓ వ్యక్తి... తన కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు అతని భార్య స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా... ఆమె గర్భవతిగా తేలింది. కారణం తండ్రే అని తేలింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
దారుణం... కన్నకూతురిపై తండ్రి అత్యాచారం! - విశాఖ క్రైం న్యూస్
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి... దారుణానికి ఒడిగట్టాడు. కొండంత భరోసా ఇస్తాడనుకున్న ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి ముసుగులో తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురం ఠాణా పరిథిలో జరిగింది.

మల్కాపురంలో దారుణం... కన్నకూతురిపై తండ్రి అత్యాచారం