ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కాటు: కుమారుడి మరణవార్త విని ఆగిన తండ్రి గుండె - విశాఖలో కుమారుడి మరణవార్త విని ఆగిన తండ్రి గుండె

కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు తండ్రీ కొడుకులను పొట్టనపెట్టుకుంది. వైరస్ బారిన పడి కుమారుడు మృతి చెందగా..ఆ వార్త తెలిసి తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా మాకవరపాలెంలో చోటుచోసుకుంది.

father and son died with corona in vishaka
కుమారుడి మరణవార్త విని ఆగిన తండ్రి గుండె

By

Published : Apr 25, 2021, 10:47 PM IST

కరోనాతో కుమారుడు మృతి చెందిన వార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందిన హృదయ విదారకమైన విశాఖ జిల్లా మాకవరపాలెంలో చోటుచేసుకంది. తామరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముళ్ళపూడి రాజారావు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. బాధితుడుని విశాఖ తరలించి వైద్యం అందిస్తుండగా..ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న రాజరావు తండ్రి ఏళ్ల సుబ్బారావు (80) గుండెపోటుతో కుప్పకూలాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా.. మృతుడు రాజారావుకు వచ్చే నెల 13న వివాహం జరగాల్సిఉందని..,శుభలేఖలు పంచే క్రమంలో వైరస్ బారిన పడ్డారని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details