ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు

దిల్లీలో 18రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో నిరసనలు చేశారు. అనంతపురం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆందోళనలు సాగాయి.

By

Published : Dec 15, 2020, 10:42 PM IST

farmers protest at kadiri anantapur district
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కిసాన్ జ్యోతులతో జీవిమాను సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన తెలిపాయి. లక్షలాది మంది రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ నెల 21న పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లాలో...

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వాటి వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో రైతు సంఘాల నాయకులు జాతీయ రహదారిపై కాగడాలు చేపట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్తగా వచ్చిన చట్టాలతో రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మగా మారుతుందని వాపోయారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: పవన్‌

ABOUT THE AUTHOR

...view details