ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎమ్మెల్యే కన్నబాబు ఒత్తిడితోనే అక్రమ మ్యూటేషన్లు' - illegal-mutations in vizag

విశాఖ జిల్లా అచ్యుతాపురం మాజీ తహశీల్దార్ నారాయణరావు అక్రమ మ్యూటేషన్లకు పాల్పడ్డారని రైతు పైలా వెంకట స్వామిబాబు కుటుంబీకులు ఆరోపించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ప్రోద్బలంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి ఆక్రమించారని ఆందోళన
భూమి ఆక్రమించారని ఆందోళన

By

Published : Sep 13, 2021, 8:36 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు ఒత్తిడి వల్లే.. అచ్యుతాపురం మాజీ తహశీల్డార్ నారాయణరావు అక్రమ మ్యూటేషన్లకు పాల్పడ్డారని రైతు పైలా వెంకట స్వామిబాబు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తొమ్మిది నెలలుగా తహశీల్డార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయ జరగలేదని వాపోయారు. అచ్యుతాపురం మండలం భోగాపురం, దుప్పుతూరు గ్రామ పరిధిలోని 32 ఎకరాల 49 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయస్థానంలో పోరాడుతున్నామని, జిల్లా కోర్టులో స్టే ఉండగా అప్పటి తహశీల్దార్ రాజకీయ ఒత్తిడితో ఇతరుల పేరుతో మ్యూటేషన్ చేశారని వివరించారు. దీనిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

భూమి ఆక్రమించారని ఆందోళన

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఒత్తిడితో అచ్యుతాపురం మాజీ తహశీల్దార్ అక్రమాలకు పాల్పడ్డారు. భోగాపురం, దుప్పుతూరు గ్రామంలో ఉన్న తమ భూమిని అక్రమ మ్యుటేషన్లు చేశారు. ఈ ఘటనపై న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశాం. అధికారులు స్పందించి, మా సమస్యను పరిష్కరించండి.

-వరలక్ష్మి, బాధితురాలు

ఇదీచదవండి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 864 కరోనా కేసులు.. 12 మరణాలు

ABOUT THE AUTHOR

...view details