నిరుద్యోగ యువతను కొన్ని ప్లేస్మెంట్ ఏజెన్సీలు మోసం చేస్తున్నాయని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రతినిధులు వెల్లడించారు. కొవిడ్ కష్ట కాలంలో పరిస్థితులే అదనుగా.. యువతకు గాలం వేస్తున్నారని చెప్పారు. కాకినాడ, విశాఖ నగరాల్లో వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ.. నకిలీ ఆఫర్ లెటర్లను సైతం సదరు ప్లేస్మెంట్ సంస్థలు ఇచ్చాయని.. ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నప్లేస్మెంట్ ఏజెన్సీలు - విశాఖ జిల్లా తాజా వార్తలు
ఉద్యోగాల పేరుతో ప్లేస్మెంట్ ఏజెన్సీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. కరోనా పరిస్థితులను అడ్డం పెట్టుకుని యువతకు గాలం వేస్తున్నాయి. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు అంటూ ఫేక్ ఆఫర్ లెటర్స్ ను తయారు చేస్తున్నాయి.
![ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నప్లేస్మెంట్ ఏజెన్సీలు fake jobs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9065269-388-9065269-1601950561702.jpg)
fake jobs