విశాఖలో విదేశీ నకిలీ కరెన్సీ కలకలం రేపింది. 1 మిలియన్ విలువ చేసే నకిలీ యూరో కరెన్సీ నోటును మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8.4 కోట్ల విలువ చేసే విదేశీ యూరో కరెన్సీని.. భారత కరెన్సీ కోటి రూపాయలకే ఇస్తామని మాయమాటలు చెప్పి మార్పిడి చేసేందుకు యత్నించారు. విశాఖ ద్వారకానగర్ లోని ఓ హోటల్ లో డీల్ కుదుర్చుకుంటుండగా పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీ - విశాఖలో ఫేక్ యూరో కరెన్సీ పట్టివేత వార్తలు
విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కరెన్సీ మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
![విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీ విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9811150-354-9811150-1607434867432.jpg)
విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీ
Last Updated : Dec 8, 2020, 11:01 PM IST
TAGGED:
vishaka crime news