విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఓ బడ్డీ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొత్తగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కడుతున్నారు. గవర్నమెంట్ ఆస్పత్రి పక్కన ఉన్న కర్రీ పాయింట్ బడ్డీలో కొత్త గ్యాస్ సిలెండరు తగిలిస్తుండగా పైప్ లీక్ అయ్యి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరగగా... ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు తెలిపారు.
Gas cylinder explosion : పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం.. - విశాఖలో అగ్ని ప్రమాదాలు
విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదవశాత్తు లీక్ అయ్యి పేలింది. అయితే ఈ పేలుడు ఘటనవో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాలనీలోని ఓ ఇంట్లో కర్రీపాయింట్ యజమానితో పాటుగా మరో ముగ్గురు నివసిస్తున్నారు. వారిలో ఒకతను వంట చేస్తుండగా కొత్త సిలెండరుకు పైప్ తగిలిస్తుండగా పైప్ లీక్ అయ్యి ప్రమాదం సంభవించింది అని వంట మాస్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు వచ్చి మూటలతో ఇసుకను తెచ్చి మంటలు వ్యాప్తించకుండా అదుపు చేశారు. తెదేపా 7వ వార్డు నాయకులు పిళ్ళా వెంకటరావు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. పి.ఎమ్ పాలెం పోలీసులు సంఘటన వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :fire accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం