ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''అధికరణం రద్దుతో కశ్మీర్​లో పాక్ ఆటలకు చెల్లు'' - mehabooba mufti

అధికరణం 370 రద్దుతో జమ్మూకశ్మీర్​లో పాకిస్థాన్ ఆటలకు చెక్ పడుతుందని ఆ రాష్ట్ర వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో.. ఇతర రాష్ట్రాల వాళ్లు జమ్మూకశ్మీర్​లో స్వేచ్ఛగా తిరిగే వీలు కలుగుతుందని.. ఇది ఆ రాష్ట్ర ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషించారు.

jammu kashmir

By

Published : Aug 5, 2019, 3:15 PM IST

జమ్మూకశ్మీర్ వ్యవహారాల నిపుణుడు ప్రొ.శ్రీమన్నారాయణ

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న తాజా చర్యలపై.. నిపుణులు స్పందిస్తున్నారు. అధికరణం 370, 35 ఏ రద్దుతో ఆ రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులతో.. జమ్మూకశ్మీర్ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ.. ఈటీవీ భారత్ తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యటకంతోనే చాలామాంది జమ్మూకశ్మీరీలు ఉపాధి పొందుతారని చెప్పారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో.. ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూకశ్మీర్​లో వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుందని.. అక్కడి స్థానికుల్లో భయం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో.. కేంద్రం సరిహద్దు రాష్ట్ర ప్రజలకు తగిన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. తాజా నిర్ణయంతో.. కశ్మీర్ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం ఇకపై తగ్గిపోతుందని.. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం చేస్తున్న తప్పుడు వాదనలకు ఇకపై ఆస్కారం ఉండదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details