ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లోనూ 'విశాఖ ఉక్కు' తరహా ఉద్యమం: మాజీ ఎంపీ వీహెచ్ - జీవీఎంసీ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

ఉక్కు ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడేందుకు.. పవన్​ కల్యాణ్​ కదిలి రావాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఐకాస నేతల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని.. ఎంపీ హర్షకుమార్​తో కలిసి సందర్శించారు. హైదరాబాద్​లోనూ ఇదే తరహా ఉద్యమం చేపడతామన్నారు.

ex mps vh, harsha kumar visited jac hunger strike camps at gvmc, ex mp vh demands pawan kalyan to participate in steel agitations
విశాఖలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎంపీలు వీహెచ్, హర్షకుమార్, ఉక్కు ఉద్యమంలో పవన్ కల్యాణ్ పాల్గొనాలని మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్

By

Published : Apr 2, 2021, 7:47 PM IST

విశాఖ జీవీఎంసీలోని గాంధీ బొమ్మ వద్ద.. ఐకాస నేతల రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్ సందర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గతంలో బాగానే ఉండేవారు కానీ ఇప్పడు మారిపోయారంటూ విమర్శించారు. పోరాడే శక్తి, దమ్ము ఆయనకు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న భాజపాను వదిలి.. ఉక్కు ఉద్యమంలో కలిసి పోరాడాలని కోరారు.

హైదరాబాద్​లోనూ ఇదే తరహా ఉద్యమం ప్రారంభించనున్నట్లు హనుమంతరావు చెప్పారు. లేదంటే ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకూండా అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details