మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఏప్రిల్ 15న కొవిడ్ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్ బారిన పడిన ఆయన.. కొద్దిరోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
sabbam hari has tested positive for coronavirus
Last Updated : Apr 26, 2021, 2:43 AM IST