Visakha steel:రైతుల చట్టాలు వెనక్కి తీసుకున్నట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం వెనక్కి తగ్గే రోజు దగ్గరలోనే ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. స్టీల్ గుర్తింపు యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉక్కుపై కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా విశాఖలో సదస్సు నిర్వహించారు. దేశానికి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెట్టుబడిదారులకు కేంద్రం ఉచితంగా అందిస్తోందని నాగేశ్వర్ ఆరోపించారు.
దేశంలో ప్రతి పరిశ్రమలోనూ జరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రతిఘటనకు సిద్ధం కావాలన్నారు. విశాఖ ఉక్కు రక్షణ కోసం కేంద్ర నిర్ణయాలపై ప్రతిఘటనను మరింత ఉద్ధృతం చేయాలని సూచించారు.