పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం విధి లేని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం ముఖ్యమంత్రికి గానీ, ప్రభుత్వానికి గానీ లేదన్నారు. జగన్ నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని నాశనం చేయటానికా..? అని ప్రశ్నించారు. తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధికి నష్టం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.
'ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని నాశనం చేయటానికా ?' - ప్రభుత్వంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు కామెంట్స్
వైకాపాకు ప్రజలు అధికారం కట్టబెట్టింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికేనా.. అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు