ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు కుర్చీలైనా ఇవ్వగలరా?' - vizag latest news

బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం రాజకీయ ఎత్తుగడ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. నిధులు లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఏంటని ప్రశ్నించారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్​లకు కుర్చీలు అయినా ఇవ్వగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ayyanna patrudu
ayyanna patrudu

By

Published : Oct 18, 2020, 5:02 PM IST

కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే బీసీ కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఆదివారం విశాఖలోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికే ప్రభుత్వం అప్పులు చేస్తోందన్న ఆయన... ఈ కార్పొరేషన్లకు ఏ విధంగా నిధులు కేటాయిస్తుందని ప్రశ్నించారు. 56 బీసీ కార్పొరేషన్లకు కార్యాలయాలు, ఛైర్మన్​లకు కుర్చీలు అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అని అడిగారు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు.

మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. తితిదే బంగారంపై ఈ సర్కార్ కన్ను వేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోవాలని అయ్యన్న అన్నారు.

ABOUT THE AUTHOR

...view details