ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలి' - కేంద్ర ఆర్థికమంత్రికి విశ్రాంత ఐఏఎస్ శర్మ లేఖ

జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ..విశ్రాంత ఐఏఎస్ శర్మ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కరోనా కట్టడికి సమగ్ర విధానం అమలు చేయాలని సూచించారు.

Ex IAS Sharma
Ex IAS Sharma

By

Published : May 11, 2021, 10:03 AM IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విశ్రాంత ఐఏఎస్, కేంద్రమాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరుకు సమగ్ర విధానం అమలు చేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విధానం అమలుతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్‌లో పూర్తిగా విఫలమయ్యామన్న శర్మ…ఇప్పటికైనా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లకపోతే విపరీత పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details