చిన్నతనం నుంచే గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలని... ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సూచించారు. చిన్నారులతో వారి తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. పాఠశాల చిన్నారులకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పిస్తూ... చేపట్టిన 555 కిలోమీటర్ల నడక ముగింపు కార్యక్రమం విశాఖలో జరిగింది.
'గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన పెంచుకోవాలి' - రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ న్యూస్
ప్రస్తుత పరిస్థితుల్లో... గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అందరిలో అవగాహన పెరగాలని నటి రకుల్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. పిల్లలతో తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడాలని సూచించారు.
rakul preeth singh
పోర్టు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. మంచి కోసం నడవడం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని... ద వైజాగ్ 5ఎ.ఎం క్లబ్, రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం... నడకలో పాల్గొన్న 55 మందికి రకుల్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.