ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బాలల హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం'

బాలలకు హక్కులు కల్పించినా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. నవంబరును అంతర్జాతీయ దత్తత మాసంగా ప్రకటించిన సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాలు పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలను రక్షించాలి, వారిని చదివించాలని నినాదాలు చేసి ప్రతిజ్ఞ చేశారు.

Breaking News

By

Published : Nov 19, 2020, 10:12 PM IST

అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు, అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ప్రారంభించారు. బాలలకు హక్కులు కల్పించినా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి అన్నారు. వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.

స్థానిక బాల సదనంలోని బాలికలు, అంగన్​వాడీ సిబ్బందితో మానవహారం నిర్వహించారు. ఆడపిల్లలను రక్షించి, చదివించాలని ప్రతిజ్ఞచేశారు. బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వారిపై జరుగుతున్న అగాయిత్యాలను రూపుమాపటంలో అందరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు.

విశాఖలో...

విశాఖలో జిల్లా బాలల సంరక్షణ విభాగం, స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ, కార్యాలయంలో అంతర్జాతీయ దత్తత మాసం ఘనంగా జరిగింది. పిల్లల దత్తత అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దత్తతకు చట్టబద్ధత గల విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖాధికారి రమణ కుమారి తెలిపారు.

అనంతపురంలో...

బాలికల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అనంతపురం నగరపాలిక ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో..

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ గాంధీనగర్​లో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కులు కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అని విజయవాడ సెంట్రల్ ఏసీపీ షర్ఫుద్ధీన్ అన్నారు. నగర వ్యాప్తంగా బాలకార్మికులను ఆపరేషన్ ముష్కాన్ పేరుతో కాపాడి వారిని సంరక్షించడంలో విజయవాడ నగర పోలీసులు కృషిచేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జనసంచారంలోకి వానర దండు... భయపడుతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details