ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

' రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి' - bosta satya narayana

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మున్సిపల్ అధికారులతో భేటి అయ్యారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

' రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి'

By

Published : Jun 30, 2019, 5:20 AM IST

Updated : Jun 30, 2019, 10:10 AM IST

రాష్ట్ర అభివృద్దిలో ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. తద్వారా అధికారులు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన వారవుతారని పునరుద్ఘాటించారు. మున్సిపల్ అధికారులతో విశాఖలో ఆయన మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సమావేశంలో మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజనతో పాటు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తెలుసుకున్నారు.

Last Updated : Jun 30, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details