ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను..హైపర్ కమిటీకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ సూచనల మేరకు ..చర్యలు చేపడతామని విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా కట్టడి ప్రాంతాలను విభజిస్తామన్నారు. ఆయా పాజిటివ్ కేసులు విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ..కట్టుదిట్టమైన చర్యలను చేపడాతామని ఆయన తెలిపారు. వెంకటాపురం ప్రాంతంలో ఎప్పటికప్పుడూ వైద్యపరీక్షలు చేస్తున్నాం.
బాధిత గ్రామాల ప్రజలకు ప్రత్యేక కార్డులిస్తాం.. - విశాఖలో లాక్డౌన్ వార్తలు
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీకి ఇస్తాయని, వాటిపైనే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. బాధిత గ్రామస్థులందరికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ... క్రమపద్ధతిలో రికార్డు నిర్వహణకోసం ప్రత్యేకంగా కార్డులు ఇస్తామన్నారు. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నీటిని తుది నివేదికలు వచ్చే వరకు వినియోగించబోమని స్పష్టం చేశారు. కొవిడ్- కేసుల కోసం కంటైన్మెంట్ జోన్ల పరిధి కేంద్రం నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం హాజరకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ఆయా విభాగాధిపతులను అప్రమత్తం చేశామంటున్న వినయ్ చంద్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
విశాఖ జిల్లా కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి